

ఉల్లిపాయ వాసన ఘాటుగా ఉంటుంది. అందువలన ఉల్లిపాయను సగానికి కోసి ఆలా వదిలేస్తే అది బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. అందువల్ల కోసి ఉంచిన ఉల్లిపాయలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అధికసంఖ్యలో పెరుగుతాయి. అలాంటి ఉల్లిపాయను తిన్నప్పుడు దానిలోని బ్యాక్టీరియా మన కడుపులోకి ప్రవేశించి కడుపునొప్పి మరియు ఇన్ఫెక్షన్స్ కి దారి తీస్తాయి. అయితే ఉల్లిపాయను కోసి ఒకరోజు అలాపూర్తిగా వదిలేస్తేనే ఈ విధంగా జరుగుతుందట.
అందువల్ల అవసరం అయిన సమయంలో మాత్రమే ఉల్లిపాయ కోసుకోవాలి. కానీ ఉల్లిపాయ విషయంలో మరొక వాదన కూడా ఉంది. కొంతమంది ఉల్లిపాయకు ఉన్న ఘాటైన వాసన త్వరగా బ్యాక్టీరియాను దరిచేరనివ్వదని. అయితే కోసే సమయంలో మరియు నిల్వ చేసే సమయంలో గనుక కొన్ని జాగ్రత్తలు వహించడం వలన 2 రోజుల వరకు ఉల్లిపాయ నిల్వ ఉంటుందట. ఉల్లిపాయనే కాదు ఎటువంటి ఆహారాన్ని అయినా పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.