ఇయర్ ఫోన్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?

45
do-you-know-how-dangerous-it-is-to-use-earphones

ఇయర్ ఫోన్, ఇయర్ పీస్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ ఆపరేటింగ్ ఇయర్ ఫోన్ లాంటి పరికరాలను కర్ణబేరికి అత్యంత దగ్గరగా చెవిలోనే పెట్టుకుని వినడం వలన చెవిలో ఫంగస్, బ్యాక్టీరియాలు పేరుకుని దురద, నొప్పి, చెవిలో చీము కారడం, పోటు, చెవిలో జోరీగ శబ్దం చేస్తున్నట్లుగా గుయ్ మని సౌండ్ వచ్చినట్టు చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇయర్ ఫోన్లు పెట్టుకున్న సమయంలో చెవిలోకి గాలి దూరే అవకాశం తగ్గిపోతుంది, దీంతో చెవిలో ఫంగస్ ఎక్కువవుతుంది. మనదేశంలోని ENT వైద్యులు చెబుతున్న విషయమేమిటంటే ఈ సంవత్సరం మార్చ్ నుంచి వివిధ రకాల చెవి రోగాల సమస్యలతో సతమతమవుతున్న వారి సంఖ్య 4 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది.

ఇయర్ ఫోన్లు వాడటం వల్ల వినికిడి శక్తి తగ్గిపోతుంది. సాధారణంగా వయసు ఫై బడే కొద్దీ మనం ప్రతిఏటా కొంత వినికిడి శక్తిని సహజంగానే కోల్పోతాం, దీనికి మందు లేదు. ఇది చాలక మనం చేతులారా మన వినికిడి శక్తిని చిన్న వయసులోనే బలవంతంగా కోల్పోయేలా ప్రవర్తిస్తే వైద్యులు చేయగలిగింది ఏమీ లేదు. ఇలా వచ్చే చెవుడుని చెవిటి మిషన్లు కూడా కంట్రోల్ చేయలేవు. అంతేకాదు తప్పని పరిస్థితుల్లో కొంత సమయం మీరు ఇయర్ బడ్స్ వంటి డివైజెస్ ఉపయోగించినప్పుడు వాటిని స్పిరిట్ లేదా శానిటైజర్ తో శానిటైజ్ చేయాలి, లేదంటే చెవి సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here