డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీ ఈ ఏడాది లేనట్లే … నష్టాలు తప్పవు …!

0
72

టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఊహించని సమస్యలను ఎదురుకొంటున్నారు. ఫిదా లాంటి హిట్ సినిమా చేసిన తర్వాత కూడా వరుసగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీ ఆశలతో మొదలుపెట్టిన లవ్ స్టోరీ సినిమా పరిస్థితి క్లిష్టంగానే మారింది. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆ సినిమా యొక్క షూటింగ్ పార్ట్ ఇంకొంచెం మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ అనంతరం ఆ షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు మరింత భయంకరంగా మారడంతో ఇప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన బిజినెస్ డీలింగ్స్ పై కూడా ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడే నిర్మాతకు అన్ని ఏరియాల నుంచి బిజినెస్ డీలింగ్స్ కి సంబంధించి అడ్వాన్స్ లు అందాయట. అయితే ఇప్పుడు డబ్బు ఇచ్చిన బయ్యర్లు రిస్క్ చేయలేమని డబ్బు వెనక్కి ఇచ్చేయాలని బ్రతిమాలుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే లవ్ స్టోరీ షూటింగ్ ని పూర్తి చేయాలంటే ఈ ఏడాది చివరివరకు సమయం పట్టవచ్చు. ఇక సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసుకోవాలిసిందే. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటే పెద్ద సినిమాలతో కాస్త పోటీ పడక తప్పదు. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here