కోలుకున్న క్రిష్… ఇక షూటింగ్ షురూ…

23
director-krish-jagarlamudi-recovered-and-ready-to-shoot-with-pawankalyan

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ తో తాను తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ మొదలు కానున్న క్రమంలో కరోనా టెస్టులు చేయించుకోవడంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొదలు కావాల్సిన సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు క్రిష్ కరోనా నుంచి కోలుకున్నాడు అని చెబుతున్నారు. ఆయనకు కరోనా నెగిటివ్ రావడంతో రేపటి నుంచి క్రిష్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకి పేరు ఏమీ ఇంకా ఫిక్స్ చేయలేదు. విరూపాక్ష అనే టైటిల్ ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా దాని మీద ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ప్రస్తుతానికి దీనిని pspk27 అని సంబోధిస్తున్నారు.

మొన్నీ మధ్యనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ అంతా పూర్తి చేసిన క్రమంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని భావించారు. కానీ క్రిష్ కి కరోనా సోకడంతో ప్లాన్ అంతా అప్ సెట్ అయింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రేపటి నుంచి షూటింగ్ జరుపుకోనుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ ని పవన్ కళ్యాణ్ కోరినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ క్రిష్ ని కోరాడట. ఈ సినిమాని సూపర్ హిట్ సినిమాల నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో అనే విషయం తప్ప మిగతా నటీనటులకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయితే బయటికి వెల్లడి కాలేదు. వీలైనంత త్వరలో వారి వివరాలను కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here