గుండెల్లో కత్తి దింపినట్లుగా ఉంది..

0
120
Dinesh Karthik comments on MSD

ఎంఎస్‌ ధోని..మన భారత జట్టుకే కాదు..ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోను ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. భారత్ కు టీ20 వరల్డ్‌కప్‌, వన్డే వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు సాధించిన ధోని.. ఐపీఎల్‌లో సీఎస్‌కే మూడు టైటిల్స్‌ను సాధించి పెట్టాడు. ధోని, దినేష్ కార్తీక్ వీళ్లిద్దరు సమానమైన సత్తా ఉన్న క్రికెటర్లే భారత జట్టులో ఎప్పుడు స్థానం కోసం వీరిద్దరి మధ్యనే పోటీ ఉండేది. ఈ పోటీలో ధోనీనే ఎక్కువసార్లు స్థానాల్ని గెలుచుకుని రెగ్యులర్ ఆటగాడిగా కూడా అయిపోయాడు. అంతే కాకుండా అతికొద్ది కాలంలోనే కెప్టెన్ గా పదవీ బాధ్యతలు కూడా చేపట్టాడు.

దినేష్ కార్తీక్ సొంత రాష్ట్రమైన చెన్నైకూడా దినేష్ కార్తీక్ ని కాదని చెన్నైసూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ధోనిని సెలెక్ట్ చెయ్యడంతో తనగుండెల్లో కత్తిని దింపినట్టుగా అనిపించిందని దినేష్ తెలిపారు. 2008 ఐపీఎల్ సీజన్ వేలం సమయంలో దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. తనది తమిళనాడు కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ తప్పుకుండా తనను సెలెక్ట్ చేస్తారు అని అనుకున్నాను. కెప్టెన్సీ మాత్రం ఇస్తారో ఇవ్వరో అని ఒక్క డౌట్ మాత్రమే ఉండేదని.. కానీ వారు నన్ను కొనుగోలు చేయకుండా ధోనిని కొనుగోలు చేయడం చాలా బాధగా అనిపించిందని అయన అన్నారు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్న దినేష్ కార్తీక్ 13 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here