భారీ రేటుకు బాలయ్య మూవీ దక్కించుకున్న దిల్ రాజు..!!

23
Dil Raju Got Balayya Movie

నందమూరి బాలకృష్ణ, బోయపాటి వీళ్లిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ వస్తుంది. తాజాగా బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో టైటిల్స్ తెరపైకి వచ్చాయి.

ఈ సినిమాకి  ‘గాడ్ ఫాదర్’ అనే పేరుని చిత్రబృందం ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై  మిర్యాల రవీందరెడ్డి  నిర్మిస్తున్నారు.ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్  సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే  ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్  లో జరిగిందట.

ఆంధ్ర థియేట్రికల్ హక్కులు రూ.35 కోట్లకు అమ్ముడయ్యి పొయాయని వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను రూ.16 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమా మే 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here