ధోని, కోహ్లిలు వెన్నుపోటు పొడిచారు…

0
120
Did MS Dhoni and Virat Kohli backstab Yuvraj Singh?

ప్రస్తుతం రాజకీయాలలోనే ఎత్తుగడలు, వెన్నుపోట్లు ఉంటాయని అనుకునేవారు అందరు. కానీ క్రికెట్ లో కూడా ఉంటాయని టీమిండియాకు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ధోని, కోహ్లిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యువీ కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు వీరిద్దరూ అండగా ఉండాల్సింది పోయి అతనిని టీం నుంచి తొలిగించే విధంగా ప్రవర్తించేవారు అని అయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో యోగ్ రాజ్ మాట్లాడుతూ యువరాజ్ ను ఎంతో మంది వెన్నుపోటు పిడిచారని, అందులో ధోని కోహ్లీ లు కూడా ఉన్నారని అన్నారు. ఇది చాలా బాధాకరం. సెలక్టర్ శరణ్ దీప్ కూడా యువీని జట్టు నుంచి తపిమ్చాలని చూశాడు అంటూ అయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

అయితే ధోని, కోహ్లిలపై యోగ్ రాజ్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది మొదటిసారేమి కాదు. వన్డే ప్రపంచకప్-2011 సమయంలో యువీని తప్పించి రైనాను జట్టులోకి తీసుకోవాలని ధోని ప్రయత్నించాడని గతంలో అయన ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. అంతే కాక తన కొడుకు రాణిస్తే వారికి పేరు రాదనే దురుద్దేశంతో ధోని, కోహ్లీలు యువి పట్ల వివక్ష చూపించేవారని యోగ్ రాజ్ అన్నారు. ఇక యువీ సైతం తన కెరీర్ లో సౌరవ్ గంగూలీ ద్వారా వచ్చిన మద్దతు మరెవరి నుంచి రాలేదని వ్యాఖ్యానించిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇవి ఎంతవరకు నిజమనేది ధోని కోహ్లీలు స్పందిస్తే గాని మనకు తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here