ధోని మరో రెండు సీజన్లు ఆడతాడు…!

0
135
Dhoni will play more two seasons

ధోని ప్రస్తుతం 2019 వరల్డ్ కప్ తరువాత అసలు కనిపించడం లేదు. అతను బెస్ట్ కెప్టెన్ గానే కాకుండా మంచి కీపర్ కూడా. అతను కెప్టెన్సీ లో ఒక ప్రపంచ కప్ మరియు టి20 ప్రపంచ కప్ కూడా మన దేశానికి తెచ్చిపెట్టిన ఘనత అతనిది. అయితే ప్రపంచ కప్ 2019 తరువాత అతని పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆయనకు మళ్ళీ జట్టులో స్థానం ఉంటుందో, ఉండదో అని అందరూ ఆశ్చర్యం గా చూస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఐపియల్ వాయిదా పడింది. ఈ సంవత్సరం ఐపియల్ జరుగుతుందో, జరగదో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో అతని పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసేవిధంగా వీవీఎస్ లక్షణ్ తన ఆశాభావాన్ని వ్యక్త పరిచాడు.

అదేమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని మరో రెండు, మూడు ఐపియల్ సీజన్లు ఆడతాడని అయన తన నమ్మకాన్ని వ్యక్త పరిచారు. అంతేకాక మహి అద్భుతమైన ఫిట్ నెస్ తో ఉన్నాడని, చెన్నై సూపర్ కింగ్స్ అతడిని అట్టిపెట్టుకుంటుందని, వయసు పెరుగుతున్నా ధోని ఫిట్ నెస్ తోనే ఉండటం మంచి పరిణామమని అయన పేర్కొన్నారు. అదే విధంగా అతను మానసికంగానూ బలవంతుడు. చెన్నై సూపర్ కింగ్స్ కు సారథ్యం వహించడాన్ని అతడు ఎంతో ఆస్వాదిస్తాడు అని లక్షణ్ అన్నాడు. ఈ ఏడాదే కాదు మరో రెండు ఐపియల్ లు ఆడే సత్తా మహిలో పుష్కలంగా ఉందని అయన తన నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here