ధోనీలో ఇంకా సత్తా ఉంది..!

0
137
NasirHussain Comments on dhoni

పోయినా సంవత్సరం జులై  లో న్యూజిలాండ్ వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ తర్వాత ధోని ఆటకు దూరంగా ఉండటంతో ఇంతదీర్ఘ కాలిక వ్యవధి తరువాత ధోని అంతర్జాతీయ క్రికెట్ లోకి మళ్ళీ తిరిగి రావడం కష్టమేనని ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తే బెస్ట్ అని దిగ్గజ ఆటగాళ్లు అయిన సునీల్ గవాస్కర్కపిల్ దేవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ నాసిర్ హుస్సేన్ మాత్రం దీనికి బిన్నంగా స్పందించాడు. ధోని టీం ఇండియాలో కి తిరిగి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భారత జట్టుకి ధోని చేయవలసింది ఇంకా ఎంతో ఉంది అని అన్నాడు.

ధోని లాంటి ఆటగాడు తరానికి ఒక్కరే పుడతారని అయిన అలాంటి క్రికెటర్కు తాను ఎప్పుడు రిటైర్ అవ్వాలో తనకి తెలుసు అని తన మీద రిటైర్ కమ్మంటూ ఎవ్వరూ వత్తిడి తీసుకురానవసరం లేదని  హుస్సేన్ సూచించారు. ధోనిలో ఇంకా ఆడే టాలెంట్ ఎంతో ఉందన్నాడు. ధోని కనుక వెళ్ళిపోతే మళ్ళీ అలాంటి క్రికెటర్ దొరకాలంటే చాల కష్టం అని, ఒక వైపు దిగ్గజం అని పొగుడుతూనే మరోవైపు రిటైర్ కావాలంటూ ఒత్తిడి చేయడం తగదు అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here