ఓ వైపు గెలుపు.. మరో వైపు గాయాలు..

33
Shreyas Iyer

ఢిల్లీ కేపిటల్స్ ఈ సీజన్ లో మంచి ఊపుమీద ఉంది. విజయాల మీద విజయాలను తనసొంతం చేసుకుంటూ టేబుల్ లో టాప్ పొజిషన్ లో నిలిచింది. కానీ ఆ జట్టును గాయాలు మాత్రం తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మలు జట్టునుండి విరమించగా గాయం కారణంగా పంత్ కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లు ఆడలేని పరిస్థితి నెలకొంది.బుధవారం రాత్రి దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో కొనసాగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడి.. అర్ధాంతరంగా ఫీల్డ్ నుంచి వెనుదిరిగాడు.

ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. అతని ఎడమ భుజానికి గాయమైంది. ఫిజియో అయ్యర్ ను డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకుని వెళ్ళిపోయాడు. తదుపరి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రతపై ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని శిఖర్ ధావన్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. వీరు ఆడబోయే తరువాతి మ్యాచ్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం కావొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్‌ తో శనివారం సాయంత్రం ఢిల్లీకి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌కు అయ్యర్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here