శ్రీవారి కోసం ఆ పాత్రలో దీపికా..

23
deepikapadukone-will-play-small-role-in-circus-movie

బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌ సర్కస్‌కి వెళుతున్నారు. అది కేవలం అతిథిగా. మరి ఈ అతిథి సర్కస్ లో ఏం చేస్తారో చూడాలి. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సర్కస్‌’. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఈ సినిమాలో కథానాయికలు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిన్న పాత్రలో తళుక్కుమంటారట రణ్‌వీర్‌ సింగ్‌ భార్య దీపికా పదుకోన్‌. శ్రీవారి కోసం ఆ చిన్న పాత్రను చేయడానికి కూడా ఒప్పుకున్నారట దీపికా‌. పెళ్లి ఐన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన రెండవ చిత్రం ‘సర్కస్‌’. ఇప్పటికే ‘83’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here