డివిలియర్స్‌ అంటే ఇష్టమంటున్న షాహిద్‌ భార్య!

13
Meera-Rajput-fan-of-De-Villiers.by mirchipataka

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ తరచూ తన కుటుంబం గురించిన విషయలను, ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్’‌ అనే సెస్షన్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు మీరా తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. ఈ క్రమంలో మీ క్రష్‌ ఎవరని ఓ అభిమాని ఆమెను అడగగా  ఇచ్చిన సమాధానం అందరిని షాక్ కు గురిచేసింది. ‘నాకు దక్షిణాఫ్రియా క్రికెటర్‌ ఏబి డివిలియర్స్‌ అంటే చాలా క్రష్‌, ఐ లవ్‌ హిమ్’ ‌ అంటూ మీరా జవాబిచ్చారు.

క్షణం కూడా ఆలోచించకుండా ఓపెన్‌గా ఆమె ఇచ్చిన ఈ సమాధానికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఇక దీనికి షాహిద్‌ ఎలా రియాక్ట్ అవుతాడో   తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. అదేవిధంగా తన ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ఏంటని అడుగగా ప్రముఖ కామెడీ షో ‘షిట్స్ క్రీక్’ అంటే  తనకెంతో ఇష్టమని ఆమె చెప్పారు. కాగా షాహిద్‌-మీరాలు 2015లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి కూతురు మిష, కొడుకు జైన్‌లు ఉన్నారు. షాహిద్‌ వరస సినిమాలతో బిజీగా ఉండగా  తెలుగు రీమేక్‌ ‘జెర్సీ’లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here