హాస్పిటల్లోనే దాదా.. రేపు గంగూలీ డిశ్చార్జ్‌

24
Sourav Ganguly

బీసీసీఐ అధ్యక్షుడు మరియు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈరోజు కూడా హాస్పిటల్‌లో గడపనున్నారు. గుండెపోటు వచ్చిన సౌరవ్‌కు కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. దాదా గుండెకు రెండు షంట్లు కూడా వేశారు. అయితే ఇవాళ ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉన్నది. కానీ సౌరవ్ చికిత్స గురించి ఇవాళ తాజాగా హాస్పిటల్ వర్గాలు ప్రకటన చేశాయి. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య పరంగా అతను ఫిట్‌గా ఉన్నారని, అయితే సౌరవ్ మరొక రోజు హాస్పిటల్‌లో ఉండాలనుకుంటున్నారని, రేపు దాదా డిశ్చార్జ్ అవుతారని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here