

చికెన్ ను అందరు చాలా ఇష్టం తో తింటారు. కొంతమంది కి అయితే చికెన్, మటన్ లేనిదే ముద్ద దిగని పరిస్థితి. చికెన్ ను అలా ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు దాబాలో చికెన్ లభ్యం అవ్వడకపోడం వల్లా తీవ్రమైన ఆవేశానికి గురి అయ్యారు. తాగిన మత్తు లో ఉన్నవారు దాబాకు నిప్పు ని అంటించసాగారు. ఈ ఘటన మహారాష్ట్ర లోని నాగ్పూర్ లో ఆదివారం జరిగింది. శంకర్ టైడే 29, సాగర్ పటేల్ 19 ఇద్దరు మద్యం ని సేవించడం జరిగింది. అర్దరాత్రి ఒంటిగంట సమయం లో బెల్టారోడి ప్రాంగణం లో రోడ్డు పక్కన ఉన్న ఓ దాబా హోటల్ కు వెళ్లడం జరిగింది. చికెన్ ఐటమ్ కోసం ఆర్డర్ చెయ్యడం జరిగింది. ఆ దాబాలో చికెన్ అయిపోంది. దాబా ఓనర్ చికెన్ దొరకదని సమాధానం ఇచ్చాడు శంకర్, సాగర్లు మాత్రం తమకు తప్పకుండా చికెన్ కావాలని దాబా ఓనర్ తో వాదనకు దిగారు. చికెన్ ఐటమ్స్ దొరకకుండా ఉండడం వల్లా ఆవేశానికి గురి అయ్యి ఇద్దరు నిందితులు దాబాకు నిప్పు ని అంటించారు.
ఈ ప్రమాదం లో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారందరు బయటకు రావడం వల్లా ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడం వల్లా ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలను తీసుకోవడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు టుకొని వెళ్లారు.