బ్రిటన్ లో చిన్నారులకు అంతుచిక్కని అనారోగ్యం…

0
136
Coronavirus alert: Rare syndrome seen in UK children

ఇప్పటికే కరోనా తో అతలాకుతలం అవుతున్న బ్రిటన్ లోని చిన్నారులకు అంతు చిక్కని అనారోగ్యంతో బాధపడ్తూ ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. కడుపు నొప్పి, గుండెల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తుండటం తో వారిని ఐసియూ లో ఉంచి చికిత్స అందించాల్సి వస్తుంది. ఈ అనారోగ్యం కరోనా కి సంబంధించిందని డాక్టర్స్ మొదట భావించినప్పటికీ, వైరస్ లక్షణాలు లేని పిల్లల్లో కూడా ఈ లక్షణాలు కనిపించడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దింతో జాతీయ ఆరోగ్య సేవ (NHS ) అప్రమత్తమై హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి లక్షణాలు కనిపించిన పిల్లలను వెంటనే హాస్పిటల్స్ లో చేర్చుకోమని వైద్యులకు లేఖ అందజేసింది. ప్రాణాంతక ‘టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ లక్షణాలు వారిలో కనిపించాయని పేర్కొంది. తాజా అనారోగ్యం ‘సార్స్ – కొవ్ -2 ‘ కి సంబంధించింది అయి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

బ్రిటన్ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన పిల్లలు ఈ వ్యాధితో ఐసియూ లో అడ్మిట్ అయ్యారని, ఇది ఇప్పటివరకు లండన్ కి చెందిన పిల్లలో మాత్రమే కనిపించిందని అని NHS పేర్కొంది. దీనివల్ల ఎవరైనా చనిపోయారా? లేదా ? అనే విషయాన్నీ ఇంకా NHS వెల్లడించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here