పోలీస్ శాఖలో కరోనా కలకలం : డిజిపి ఆదేశాలు ..!

0
60

తెలంగాణాలో కరోనా పోస్టివ్ కేసెస్ పెరగడముతో ప్రజలకు ఆందోళన పెరిగింది. కరోనా కట్టడి కొసొమ్ అహర్నిశలు పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది తో పాటు, పోలీసులు కూడా ఆ మహమ్మారి బారినపడుతున్నారు . . కరోనా లక్షణాలతో బాధపడుతున్న పోలీసు ఉన్నతాధికారులు, కింద స్థాయి సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. అని జిలాల్ల ఎస్పీలు, కమీషనర్లకు ఈ మేరకు జారీ చేసారు. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సెలవు తీసుకోవాలని డిజిపి సూచించారు. అంతేగాక, ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి వెంటనే అనుమతివ్వాలని ఆదేశించారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 84 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది పోలీసు శాఖలో తొలి మరణం కూడా సంభవించింది. దయాకర్ రెడ్డి అనే పోలీసు కానిస్టేబుల్ కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్ రెడ్డి, జియాగూడలో విధులు నిర్వహించేవారు.

కంటైన్మెంట్ జోన్లు, కరోనా చికిత్సా కేంద్రాల్లో విధుల నిర్వహణ వల్లే వీరికి కరోనా పాజిటివ్ వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన అధికారులతోపాటు వారి కుటుంబసభ్యులను హోంక్వారంటైన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4111కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2138గా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా తో 156 మంది ప్రాణాలు కోల్పోయారు .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here