గృహ అమ్మకాల్లో 39 % క్షిణత: హైదరాబాద్

0
121

కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుత సంవత్సరం జనవరి-మార్చ్ త్రైమాసికం లో, హైదరాబాద్ లో ఇల్లు/ ప్లాట్స్ అమ్మకాలు గత ఏడాది తో పోలిస్తే 39 % క్షిణించాయి అని ప్రొప్ టైగర్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి -మార్చ్ లో అమ్మకాలు 39 % శాతం క్షిణించాయని వివరించింది. ఈ ఏడాది 69,235 ఇల్లులు అమ్ముడుపోయాయని తెలిపింది, ఇదే 2019 త్రైమాసికం లో 90 వేలకు పైగా ఇల్లులు అమ్ముడుపోయాయని సంస్థ తెలిపింది.

కొత్త ప్రాజెక్ట్స్ కూడా ప్రారంభం కావడం సగానికి పైగా తగ్గిపోయాయని తెలిపినది, లాక్ డౌన్ కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు అన్నిదెబ్బతిన్నాయి. స్థిరాస్తి రంగం పై కరోనా తీవ్ర ప్రభావం పడింది అని, గృహ అమ్మకలకు మార్చ్ అత్యంత మంచి సమయం అని ప్రొప్ టైగర్ సంస్థ సి ఈ ఓ ధృవ్ అగర్వాల్ తెలిపారు. నివేదిక గణాంకాల ప్రకారం తొమ్మిది ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, గురుగ్రమ్,హైదేరాబద్, ముంబై, కోలకతా, పూణే, నోయిడా లలో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

మొబైల్ తయారీ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను విక్రయ కేంద్రాల్లో అందుబాటులోకి తేవడానికి ముందు ఆన్ లైన్ లో బుకింగ్ లు ప్రారంభిస్తారు. రానున్న వారాల్లో స్థిరాస్తి రంగంలో కూడా ఇదే పద్ధతి లో ఉండొచ్చు అని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here