ఫైన్‌కు బదులు ముద్దు..!

17
cop-suspended-for-kissing-woman-instead-of-fining-her

పెరూ రాజధాని లిమాలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఓ మహిళను పోలీస్‌ అధికారి అడ్డుకున్నారు. అయితే, ఫైన్‌ నుంచి తప్పించుకొనే క్రమంలో ఆ మహిళ అతడికి చాలా దగ్గరిగా వెళ్లింది. ఫైన్‌కు బదులు అతడికి ముద్దు పెట్టి తప్పించుకునేందుకు ఆమె యత్నించింది. తొలుత అతడు ఇందుకు నిరాకరించినా ఆ తర్వాత కొద్ది సెకెన్లలోనే మనసు మార్చుకొని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియో కాస్తా వైరల్‌ అయి మిరాఫ్లోర్స్‌ మేయర్‌ లూయిస్‌ మొలినా దృష్టిలో పడింది. దీంతో అతడి నిర్వాకంపై మండిపడ్డ మేయర్‌. ఆ పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారని సిటిజన్‌ సెక్యూరిటీ ఇంఛార్జి ఐబెరో రాడ్‌గ్రూయిజ్‌ తెలిపారు.

ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లుగా తెలిపారు. ఈ ఘటనలో అధికారితో పాటు అతనికి ముద్దు పెట్టిన మహిళ కూడా భౌతిక దూరం నిబంధనల్ని పాటించకపోగా ఆమె తన దగ్గరకు వచ్చేందుకు అతడు అనుమతించాడన్నారు. ఆ మహిళను ముద్దు పెట్టుకొనేందుకు అధికారి మాస్క్‌ కూడా తొలగించడం పైన కూడా మండిపడినట్టు అక్కడి మీడియా పేర్కొంది. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదని, అతడి చర్య చాలా తీవ్రమైనది అందుకే సస్పెండ్‌ అయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, లాటిన్‌ అమెరికా దేశాల్లో కరోనా కేసులను గమనిస్తే పెరూలోనే వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే 1.2మిలియన్ల కేసులు నమోదు అవగా ఇప్పటివరకు 44వేల మంది ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here