చక్కెర మోతాదు మించితే చిక్కులే..!!

19
Sugar Benefits

చక్కెర సమస్త మానవాళికి నిత్యావసరం. కాఫీ, టీలు తాగాలాన్నా, పాలు తాగాలన్నా, పాయసం తినాలన్నా వాటిలో కచ్చితంగా చక్కెర ఉండాల్సిందే.ఈ చక్కెరలు మోతాదుకు మించితే చిక్కులు తప్పవని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు.ముఖ్యంగా చిన్నారులు చక్కెర ఎక్కువగా తీసుకుంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఇంతకూ చక్కెరతో వచ్చే ఆ చిక్కులేంటో ఒకసారి తెలుసుకుందామా..?

ప్రతిరోజు ఎన్నో రూపాల్లో మనం తీసుకునే చక్కెర శరీరంలో చేరి పులిసిపోతుంది. ఈ పులిసిపోయిన చక్కెరను శరీరంలో కొన్ని కణాలు గ్రహించి శక్తిని పొందుతాయి. ఇది క్రమంగా క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. కాబట్టి చక్కెరను మితంగా తీసుకోవడం మంచిది.

ముఖ్యంగా చిన్నపిల్లలకు చక్కెరలు ఎక్కువగా పెట్టకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్నపిల్లలు చక్కెర ఎక్కువగా తీసుకోవడంవల్ల వాళ్ళ శరీరంలో సూక్ష్మజీవులు పేరుకుపోతాయట.దానివల్ల పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత చీటికి మాటికి అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉందట.

శరీరంలో చక్కెర నిల్వలు అధికమైతే సూక్ష్మజీవులు పెరుగుతాయట. ఇలా సూక్ష్మజీవులు పెరిగిపోవడంవల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందట. అందువల్ల రకరకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందట.

కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎలుకలపై చేసిన ప్రయోగంలో తేలిన ఫలితాలు చక్కెర ముప్పుని  రుజువు చేశాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో వీలైనంత వరకు చక్కెరను తక్కువగా తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here