ధోనీ చేసింది చాలు.. హుందాగా రిటైర్‌మెంట్ ప్రకటిస్తే మేలు..!

0
110
comments on dhoni retirement

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ధోని గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ధోని తన కెరీర్ ని చాల పొడిగిస్తున్నాడని, గత ఏడాది వరల్డ్ కప్ తరువాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే చాల బాగుండేది అని అన్నారు. ధోని క్రికెట్ కు వీడ్కోలు చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాడో తెలియట్లేదని, ధోని దేశానికీ ఎంతో సేవ చేసాడని, ఇకనైనా క్రికెట్ కు హుందాగా వీడ్కోలు చెబితే చాల బాగుంటుందని అదే ధోని స్థానంలో గనక నేను ఉన్నట్లు అయితే ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించేవాడినని అయన అన్నారు. 2011 ప్రపంచకప్ తరువాత మూడు, నాలుగు సంవత్సరాలు నాకు అదే అవకాశం ఉన్నా నాకు ఆడేసామర్థ్యం లేదనిపించి నేను రిటైర్మెంట్ ప్రకటించానని అన్నాడు.

వన్డే ప్రపంచకప్ తరువాత క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోని మరల  ఐపీఎల్‌లో మైదానం లో కనిపిస్తాడని అందరు అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదాపడిన టోర్నమెంట్ మరల ఎప్పుడు జరుగుతుందో తెలియరాలేదు. ఈసారి ధోని ఐపీఎల్‌ లోఆడే ఆట ఆధారంగానే జట్టులోకి తీసుకుంటారు అనేది తెలిసిన సంగతే. ఒక వేళ  ఐపీఎల్‌ జరగని పక్షంలో టీ-20 ప్రపంచకప్ జట్టులో అవకాశం దొరుకుతుందా లేదా అనేది కూడా అభిమానులకు ప్రస్నార్ధకంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా జట్టు యాజమాన్యం, సభ్యులు దోనికి హుందాగా రిటైర్మెంట్ ప్రకటించాలని అక్తర్ అన్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here