

సాయి రామ్ శంకర్ తన సినిమాలతో అంతగా ఆకట్టుకోలేకపోయినా అందరికీ గుర్తుండే విధంగా తన పాత్రలను ఎంచుకున్నాడు. చాలా తక్కువుగా సినిమాలు తీసే సాయి, మళ్లీ వెండి తెరపై కనిపించేందుకు సిద్దమవుతున్నాడు. 2009లో విడుదలైన బంపర్ ఆఫర్ సినిమా తరువాత సాయి విజయానికి ఆమడ దూరంలో ఉండిపోయాడు.తరువాత కొంతకాలానికి వాయిదాలు పడటమో లేదా రద్దు కావడమో జరుగుతూ వచ్చింది.సాయి మళ్లీ తన ఎనర్జటిక్ నటనలో అలరించేందుక రీసౌండ్‌తో రానున్నాడు. రీసౌండ్ సినిమా షూటింగ్ మొదలౌందని సమాచారం అందింది. మరో దర్శకుడు పరిచయం కానున్నాడు అతడి పేరు కృష్ణ చిరమ్మిల్లా, అంతేకాకుండా ఈ సినిమాతో రాశీ సింగ్ అనే కథానాయిక కూడా పరిచయం కానుంది. అసలు ఈ సినిమా జులై నెలలో మొదలుకావాల్సింది. కానీ కరోనా కారణంగా ప్రస్తుతం మొదలవ్వనుంది. ఈ చిత్రం రియల్ రీల్ ఆర్ట్స్ బ్యానర్‌పై రెడ్డీ, ఎన్వీఎన్ రాజా రెడ్డీ ఆధ్వర్యంలో జే సురేష్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ సినిమా ఏ నేపథ్యంలో నడవనుందనేది తెలియాల్సి ఉంది. ఈ సమాచారం కోసం మరింత సమయం వేచి చూడాల్సిందే.