కాఫీ కేవలం అలసట తీర్చడానికే కాదు.. అందాన్ని కూడా..

19
coffee-is-not-just-for-fatigue-but-also-for-beauty

కాఫీ ని ఎక్కువగా మనలో చాలా మంది ఒత్తిడి, అలసట నుంచి బయటపడడానికి తాగుతూ ఉంటాము. అయితే కాఫీ కేవలం అలసట తీర్చడానికే కాదు.. అందాన్ని కూడా పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కాఫీ పొడి ఉపయోగించి అందాన్ని రెంటింపు చేసుకోవచ్చు. ముందుగా కాఫీ పొడి ని ఎలా ఉపయోగించి, అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ముందుగా కాఫీ పొడి తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, అర చెక్క నిమ్మరసం కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది.

కొంచెం కాఫీ పౌడర్ లో,పెరుగు, ఓట్ మీల్ పౌడర్, కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు రాసుకుని 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం మృదువుగా, తగినంత తేమను అందుకుంటుంది. అంతే కాకుండా కాఫీ పొడిని ఐస్ క్యూబ్స్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. అవసరమైనప్పుడు ఆ క్యూబ్ తీసుకుని ముఖంపై మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత రక్తప్రసరణ అంది, ముఖం తాజాగా ఉంటుంది. అంతేకాకుండా కాఫీ పౌడర్ లో ఆలివ్ ఆయిల్, కొద్దిగా చక్కెర వేసి స్క్రబ్ లాగ ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన రోజు సోప్ ను ముఖానికి ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు ముఖం కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here