కొబ్బరినీళ్ళే కదా అనుకుంటే పొరపాటే..!

293
coconutwater benefits

మన రోజువారీ జీవితంలో కొబ్బరి చెట్లు చూస్తూనే ఉంటాం. పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కొబ్బరి చెట్లకి కేరళ ఫేమస్. కేరళ ప్రజల జీవన విధానంలో కొబ్బరి సంబంధిత ఆహార పదార్థాలు ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. మన రాష్ట్రంలో కూడా కొబ్బరి చెట్లు ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఇక సిటీల్లో అంటారా.. ఆ కొబ్బరి కాయలు కొనాలంటే సామాన్య మానవుడి వల్లే కాట్లేదు. కానీ తప్పదు మనం ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి.

ఈ కొబ్బరినీళ్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. జీర్ణ క్రియ వ్యవస్థ మెరుగు పడుతుంది. స్థూలకాయస్తులు వారి బరువు తగ్గించుకోడానికి కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మరియు ప్రకాశవంతం గా మారేలా చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి అధిక తేమను అందిస్తుంది. వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. కాబట్టి అందరూ వారి వారి జీవన విధానాల్లో కొబ్బరి నీళ్లకు ఒక పాత్ర కల్పించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ మిర్చి పటాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here