రాక్‌స్టార్ కి చిరంజీవి సర్ ప్రైజ్ గిఫ్ట్..!!

25
chiranjeevi Surprizing Gift To Rock Star

పంజా వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో  మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ ఏర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ అయ్యి ‌సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే.

ఓ జంట ప్రయాణానికి అద్భుతంగా  తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ఒక హైలెట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్‌కి ఒక మ్యూజికల్ గిఫ్ట్‌తో పాటుగా ఒక లేఖని పంపారు. ఆ లేఖలో..

Dear DSP,

ఎగిసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ మ్యూజిక్ కి  ఎంత ప్యాషన్ తో మ్యూజిక్ నిస్తావో , చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే ప్యాషన్‌తో మ్యూజిక్ నిస్తావ్‌.నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. God Bless Devi! యు are Truly a Rock Star!..ప్రేమతో చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here