భజ్జీ ని రూ.4 కోట్ల దాకా ముంచారు…

0
81
Harbhajan Singh duped of Rs 4 crore by Chennai businessman

టీమిండియా క్రికెట్ ప్లేయర్ హర్భజన్‌ సింగ్‌ గురువారం చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైలోని ఒక వ్యాపారి రూ.4 కోట్లు భజ్జీ దగ్గర అప్పుగా తీసుకొని ఎగ్గొట్టాడు దీనిఫై భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2015లో హర్బజన్‌ కు తెలిసిన ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తన స్నేహితుని మాట ఫై నమ్మకంతో భజ్జీ మహేష్‌కు రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వమని మహేష్ ను భజ్జీ ఎన్నోసార్లుఅడిగి చూసాడు. గత ఏడాది ఆగస్టులో మహేష్ భజ్జీ పేరు మీద రూ. 25 లక్షల చెక్కును పంపాడు ఆ చెక్కు కూడా బౌన్స్‌ అయింది.

అప్పటినుంచి డబ్బులు ఎన్నిసార్లు అడుగుతున్నాఇవ్వకుండా మహేష్ మాట దాటవేస్తూ తప్పించుకు తిరుగుతూ బజ్జిని మోసం చేశాడు. దీంతో ఇక మాటలతో ప్రయోజనం లేదని తెలుసుకున్న బజ్జి గురువారం తమిళనాడు పోలీసులను ఆశ్రయించి మహేష్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో వ్యాపారవేత్త ముందుచూపుతోనే ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కాగా హర్భజన్ సింగ్ పర్సనల్ కారణాల వల్ల ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 2020కు అడడంలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న భజ్జీ ఐపీఎల్‌లో ఆడకపోవడం వలన రూ.2 కోట్లు కోల్పోనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here