విశాఖ లోని ఎల్ జి పాలిమర్స్ కంపెనీ లో స్టెరీన్ గ్యాస్ లీక్…

0
119
chemical gas leakage at LG Polymers industry in RR Venkatapuram village

లాక్ డౌన్ కారణం గ మూసివేయబడ్డ కంపెనీ లను ఆరెంజ్, గ్రీన్ జోన్స్ లలో తెరవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం తో చాలా చోట్ల యాజమాన్యాలు కంపెనీలు తెరవడం ప్రారంభించాయి. అలాగే ఈ ఉదయం విశాఖలోని ఎల్ జి యజమాయాన్యం కూడా కంపెనీ తెరవడం తో అందులోని కెమికల్ గ్యాస్ లీక్ అవ్వడం తో, ఆ గ్యాస్ చుట్టూ పక్కన గ్రామాలకు గ్యాస్ విస్తరించింది.

దింతో ప్రజలంతా తీవ్ర అస్వస్థత కి గురి అయ్యారు. ఎక్కడి వారు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. దాదాపుగా మృతులు ఆరుగురు ఉండొచ్చు. వందల మంది ని వెంటిలేటర్ పై ఉంచారు. బాధితుల్ని దగ్గర్లోని KGH హాస్పిటల్ కి తరలించారు. దీని ప్రభావం ముఖ్యంగా ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామం పరిసరాల్లో ఎక్కువగా ఉంది. ఆ గ్రామాన్ని పోలీస్ లు ఖాళీ చేయించారు. కెమికల్ గ్యాస్ లీక్ అవ్వడం తో ఆ వాసనకి పోలీసులు కూడా అస్వస్థతకి గురి అయ్యారు.

గ్యాస్ వ్యాప్తి 3 కిలోమీటర్స్ కంటే ఎక్కువే వ్యాపించింది. ఇళ్లల్లో ఎవరైనా సొమ్మసిల్లి పడిపోయారేమో అని ఇంటిటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నామని, దీని ప్రభావం చిన్నారులపై, వృద్దులపై ఎక్కువ ఉందని, ఎల్ జి కంపెనీ పై FIR నమోదు చేశామని, విశాఖ పరిస్థితి ఇపుడు అదుపులోనే ఉందని విశాఖ సీపీ మీనా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here