

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సినిమాలు తెలుగుతోపాటుగా మలయాళంలో రిలీజ్ అవుతాయి.అక్కడ అభిమానులు బన్నీని ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. కేరళ పోలీసులు చేసిన ఆ పని ఆ రాష్ట్రంలో బన్నీకి ఉన్న క్రేజ్‌కి అద్దం పట్టేలా ఉంది.
ప్రజల సంరక్షణలో భాగంగానే తమ సేవలని మరింత విస్తృతం చేసేందుకు ఇటీవలే కేరళ పోలీసులు పోల్ యాప్ పేరుతో ఓ మొబైల్ యాప్‌ని సిద్ధం చేశారు.ఈ యాప్ ప్రమోషన్ కోసం ‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ పోలీస్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన సీన్‌ను ఉపయోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని కేరళ పోలీస్ విభాగం ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.మలయాళంలో ఎంతోమంది సూపర్‌స్టార్స్ ఉండగా.. అల్లు అర్జున్ సినిమా వీడియోనే వాడటం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.