

క్యాలీఫ్లవర్లా కనిపించినా పోషకాల్లో ‘బ్రొకోలీ’కి సరితూగే కూరగాయే లేదంటున్నారు నిపుణులు. ఆకుపచ్చ అందాన్ని ఉన్న ఈ పువ్వులో శరీరానికి అవసరమైన పోషకాలు చాలా ఉన్నాయి. విటమిన్-ఇ, సి, బి5తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి .బ్రోకలీలో కరిగేగుణం ఉన్న ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా సమర్థంగా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, లూటిన్, బీటా కెరోటిన్, జియాక్సిథిన్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ని తొలగించడంలో సహాయపడుతాయి.
జీర్ణ వ్యవస్థని శుభ్రపరచడంలో బ్రొకోలి నేచురల్ డిటాక్స్‌లా పనిచేస్తుంది. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ వ్యవస్థ శుభ్రం చేసేందుకు దోహదపడుతాయి. బ్రొకోలీలో క్యాల్షియం అధికం. బ్రోకలీ ఎముకల ఆరోగ్యానికి సాయపడుతుంది.క్యాన్సర్ సెల్స్‌ను నాశనం చేయడంలో బ్రొకోలీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిలో సల్ఫోరిపోన్ శరీరానికి అవసరమయ్యే ఎంజైములను రక్షిస్తూనే, క్యాన్సర్‌కి కారణమయ్యే కెమికల్స్‌ను శరీరం నుంచి బయటికి పంపిస్తుంది.
బ్లడ్ షుగర్‌ని క్రమబద్ధం చేసే ఆహారాల్లో బ్రొకోలి ఒకటి. స్వీట్స్మీద, పంచదారమీద మక్కువ కలుగకుండా చేసి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది.బ్రొకోలీలో వివిధ విటమిన్లు, ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. బ్రొకోలీలో గ్లూకొరఫినైన్ చర్మ సమస్యలని దూరం చేయడంలో సహాయపడుతుంది. బ్రోకలీ లో పొటాషియం, మెగ్నీషియం నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి.