ఇలాంటి ఆటగాడిని నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు

33
Devdatt padikkal

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అందరి దృష్టిని ఆకట్టుకున్నఆటగాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌. సన్‌రైజర్స్‌తో మొదటి మ్యాచ్‌ ఆడగా ఆ మ్యాచ్ లోనే ఆఫ్‌ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో మూడు ఆఫ్‌ సెంచరీలు సాధించి అందరిని ఆకర్షించాడు. ఇతనిపై ఆస్ర్టేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటువంటి ఆటను ప్రదర్శించే ఆటగాడిని తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని అన్నాడు.

devdatt padkikkal

అతడు ఆడుతున్నమొదటి ఐపీఎల్‌ ఇది అయినా మూడు ఆఫ్‌ సెంచరీలు సాధించాడని తెలిపడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాట్రెల్‌ వేసిన షాట్‌ బంతికి తడుముకున్నాతర్వాత మ్యాచుల్లో క్వాలిటీ బౌలర్లు వేసిన బంతులను సమర్ధంగా ఆడాడు అని అన్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసినన బంతులను ముందే గమనించి చాలా చక్కగా ఆడాడని, దీనిని బట్టి అతడు ఇలా చూస్తే అలా నేర్చుకోగల ఆటగాడని అర్ధం అవుతుంది అని కితాబిచ్చాడు. భారత జట్టులో రాణించగల సత్తా అతడిలో ఉందని బ్రాడ్‌ హాగ్‌ పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here