యాక్టర్‌ గా మారిన బోనీ కపూర్‌…

17
bonnie-kapoor-turns-as-actor

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మరియు అతిలోకసుందరి శ్రీదేవి భర్త అయిన బోని కపూర్ ఇప్పుడు నటుడిగా కొత్తప్రయాణం మొదలుపెట్టారు. దాదాపు నలభై ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతున్న బోని ఇప్పుడు నటుడిగా మారారు. లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ ఓ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి పాత్రలో బోనీ కపూర్‌ నటించనున్నారు. ఈ పాత్రకు బోనీ అయితేనే సరిగ్గా సెట్ అవుతారని దర్శకుడు భావించి, ఆయన్ను కలిసి ఒప్పించారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టనున్నారు బోనీ. ఇటీవలే అనిల్‌ కపూర్‌ ముఖ్య పాత్రలో కనిపించిన సినిమా ‘ఏకే వర్సెస్‌ ఏకే’ సినిమాలో చిన్న పాత్రను పోషించారు బోనీ. ఇప్పుడు రణ్‌బీర్‌ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here