కోలీవుడ్ హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు

21
blackmails for kollywood heros

తమిళ హీరోలు విజయకాంత్‌, ధనుష్‌ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. కొందరు వ్యక్తులు మంగళవారం పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు రెండు సార్లు ఫోన్ చేసి హీరో ధనుష్‌ ఇంటిలో, విజయకాంత్‌ ఇంట్లో బాంబులు పెట్టారని సమాచారం ఇచ్చారు. ఈ కాల్స్ ఫై వెంటనే స్పందించిన పోలీసులు వారి ఇళ్లల్లో తనిఖీ  చేసారు. తమకు వచ్చిన కాల్స్ లో నిజం లేదని తేల్చారు. ప్రాథమిక విచారణలో రెండుసార్లు పోలీసులకు  ఫోన్‌ చేసిన వ్యక్తి ఒక్కరేనని తేలింది. తప్పుడు సమాచారంతో పోలీసులకు అసౌకర్యం కలిగించినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. కొన్ని నెలలుగా తమిళనాడులో ఇలాంటి బెదిరింపుల ఫోన్‌కాల్స్‌ ఎక్కువయ్యాయి. రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య ఇళ్లకు కూడా యిలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఫోన్‌ కాల్స్‌ చేసిన వ్యక్తి ఓ మానసిక వికలాంగుడు అని పోలీసుల విచారణలో తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here