బీజేపీ నాయకులు మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు

18
BJP leaders are inciting religious hatred

వరదలు వచ్చినప్పుడు, కరోనాతో ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఎన్నికలు వస్తేనే బీజేపీ నాయకులు కనపడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాషాయం నేతలు మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొండిగాళ్లకు, తొడగొట్టే నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తామన్నారు. బీజేపీ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోమని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here