రాజధానిని తాకిన బర్డ్ ఫ్లూ

17
birdflu

కరోనా ఇంకా పూర్తిగా పోనేలేదు ఇంతలో బర్డ్ ఫ్లూ వచ్చింది. దేశంలో ఇప్పటివరకూ 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నిర్థారణయ్యాయి. ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీలలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ నుండి జలంధర్‌కు పంపిన శాంపిళ్లలో 8 శాంపిళ్లు పాజిటివ్ అని నిర్ధారణయ్యింది. మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం సంజయ్ లేక్‌లోని బాతులు, మయూర్ విహార్ లోని కాకులలో బర్డ్ ఫ్లూను కనుగొన్నారు. కాగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో గతవారం రోజులుగా అత్యధిక సంఖ్యలో కాకులు, పక్షులు మృతి చెందుతున్నాయి. దీంతో వాటి శాంపిల్స్‌ను అధికారులు జలంధర్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఢిల్లీ పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకూ వందకుపైగా కాకులు మృతి చెందాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసింది, ఎక్కడైనా పక్షులు మృతి చెందినట్టు కనిపిస్తే హెల్ప్‌లైన్ నంబరుకు తెలియజేయాలని కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here