Bigg Boss 4 Day 9: మెహబూబ్ పై అమ్మ రాజేశేఖర్ ఫైర్ … !!

0
21
High Lights Of Bigg Boss 4

ప్రధానంగా వినోదం, హాస్యం, ఎమోషన్స్ మేళవింపుతో కొనసాగింది.  అలాగే అమ్మ రాజశేఖర్‌ కామెడీతోపాటు ఫన్నీ సంభాషణలు ఆకట్టుకొన్నాయి. 9వ రోజు ఎపిసోడ్స్‌లో హైలెట్స్ ఇలా ఉన్నాయి…

అల్లు అర్జు నటించిన రేసుగుర్రం చిత్రంలోని బ్లాక్‌బస్టర్ పాటతో బిగ్‌బాస్ హౌస్‌లో 9వ రోజు ఎపిసోడ్‌ ప్రారంభమైంది.హౌస్ మేట్స్ ఉత్సాహంగా స్టెప్పులతో ఆడిపాడారు. సెలబ్రిటీలందరూ కలిసి సంబరంతో 9వ రోజును జోష్‌తో మొదలుపెట్టారు. తర్వాత కిచెన్‌లో సరదాగా పనుల్లో మునిగిపోయారు. అలా సెలబ్రిటీలు తమ రోజును సరికొత్తగా ఆరంభించారు.

హాట్ హాట్‌గా తయారైన దేత్తడి హారిక తన ఫెర్ఫార్మెన్స్ ఇరుగదీసింది. గ్లామర్‌గా తయారై అందాల ఆరబోతతో సెలబ్రిటీలకు మతిపోగొట్టే పనిచేసింది. మసాలా పాటలకు డ్యాన్స్ చేసింది. మెహబూబ్‌తో కలిసి హాట్‌గా స్టెప్పులు వేసింది. . దేత్తడి రేంజ్‌లో హరిక తన గ్లామర్ ప్రదర్శనతో అలరించింది. ఎపిసోడ్‌లో మరింత జోష్‌ను నింపింది.

దివి వాద్య చీరకట్టులో అందంగా తయారై హౌస్ మేట్స్ ను ఆకట్టుకొన్నది. మెహబూబ్‌ను పిలిస్తే అమాంతంగా దివిని ఎత్తుకొని కౌగిలిలో బంధించాడు.  వీలైతే నీవు కల్యాణి ఎత్తుకోరా అప్పుడు చూద్దాం అంటూ అమ్మా రాజశేఖర్ సవాల్ విసిరితే.. మెహబూబ్ తన సత్తాను ప్రదర్శించి కల్యాణిని ఎత్తుకొన్నాడు.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4లో మెహబూబ్ అదరొట్టాడు. సిక్స్‌ప్యాక్‌తో కండల ప్రదర్శన చేసి ఆకట్టుకొన్నారు. మెహబూబ్ ఇప్పుడిప్పుడే షోలో మెల్లగా బయటపడుతున్నాడు. ఇక ముందుహౌస్ లో  మెహబూబ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారే అవకాశం లేకపోలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here