ఫైజర్ టీకా రెండో డోసు తీసుకున్న బైడెన్

11
Biden taking the second dose of the Pfizer vaccine

అమెరికా ప్రధానిగా ఎంపిక అయినా జోబైడెన్ ఫైజర్ కరోనా టీకా రెండో సరి డోసు తీసుకున్నారు. గత నెల 21న మొదటి డోసు తీసుకున్న బైడెన్ కొత్తగా రెండో డోసు కూడా తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండో డోసు తీసుకుంటున్న సందర్భంలో కొంత ఒత్తిడికి గురైనట్టు చెప్పారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే తన ప్రధాన కర్తవ్యమని బైడెన్ పేర్కొన్నారు. అతను కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బైడెన్. వ్యాక్సిన్ చాలా సురక్షితమని ఆయన పేర్కొన్నారు. కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానం పోగొట్టేందుకు 78 ఏళ్ల బైడెన్ గత నెలలో బహిరంగంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆమెరికా టీవీ చానళ్లు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. తొలి డోసు వేయించుకున్న తర్వాత రెండో డోసు తప్పనిసరి కావడంతో తాజాగా అది కూడా తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here