చిరు ధాన్యాలు తింటే ఎముకలకు బలం..

80
best-foods-to-help-strengthen-your-bones

మెరుగైన ఆరోగ్యం కొరకు ఇప్పుడంతా చిరుధాన్యాల మీదే దృష్టి పెడుతున్నారు. బరువు తగ్గాలన్నా, శరీర శక్తిని పెంచుకోవాలన్నా, గ్లూకోజు అదుపులో ఉండాలన్నా వీటి వంకే చూస్తున్నారు. రాగులు, సజ్జల వంటి చిరుధాన్యాలు ప్రస్తుతం చాలామంది వంటింట్లో కనిపిస్తుండడమే దీనికి నిదర్శనం. చూడటానికి చిన్నవి అయినా ఇవి పోషకాల గనులు! ప్రొటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాల వంటి పోషకపదార్దాలేన్నో వీటిలో దండిగా ఉంటాయి. మేలురకం పిండి పదార్థాలు కలిగి ఉన్నందున ఇవి జీర్ణక్రియ నియంత్రణకూ సహకరిస్తాయి.

ఇవి తీసుకోవడం వలన చాలాసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇవి త్వరగా ఆకలి కలగకుండా చేస్తాయి. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు రాగులు, సజ్జలు ఎముకలకు పుష్టిని అందిస్తాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలు నివారించడంలో తోడ్పడతాయి. సాధారణంగా కీళ్ల సమస్యలతో ఇబ్బందిపడేవారు ధాన్యాలు ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సలహాలిస్తుంటారు. వీటిల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కానీ చిరుధాన్యాలను ఆలోచించే అవసరంలేకుండా తీసుకోవచ్చు. ఇవి వాపు ప్రక్రియను తగ్గించే గుణం మరియు ఎముకలు దృడంగా ఉండడానికి అవసరమైన పోషకాలు కలిగుండటమే దీనికి కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here