బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ….

42
Papaya

బొప్పాయి కేవలం ముఖ సౌందర్యానికే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యలు ఒక అధ్యయనం లో తెలిపారు.బొప్పాయి లో అధికంగా విటమిన్ ఎ, బి, సి, డి  మరియు కె తోపాటు పపెయిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. పపెయిన్  చర్మం కాంతి వంతంగా ఉండేలా చేయడంతో పాటు ముఖం మీద మచ్చలు కూడా తగ్గిస్తుంది. అయితే బొప్పాయి మన జీవన శైలికి ఎలా సహకరిస్తుందో ఇప్పుడు చూద్దాం!

బొప్పాయిలో ఎక్కువ శాతం పీచు పదార్థాలు ఉండడం వల్ల  ఆకలిని నియంత్రించడం తో పాటు ఫలితంగా ఆకలి వేయదు.దీని ద్వారా ఎక్కువ సమయం తినకుండా ఉండగలరు. శరీరంలో వుండే కొవ్వును కరిగించడం వల్ల బరువు తగ్గే అవకాశాలు మెండుగా వున్నాయి. బొప్పాయి రోజూ తగిన మోతాదులో తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. నోటిలో చిగుళ్ల ఆరోగ్యానికి ఇందులో వుండే విటమిన్ సి ఎంతగానో ఉపకరిస్తుంది. అంతేకాకుండా నోటిపూత , పెదాల పగుల్ల  వంటి వాటికి విటమిన్ బి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొదించడంతో పాటు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తుంది.

పచ్చిబొప్పాయి రక్త పోటును తగ్గిస్తుంది. బొప్పాయి చెట్టు ఆకులు కూడా మలేరియా వచ్చినప్పుడు వీటిని వేడి నీళ్లలో వుండికించి,వడకట్టి, చల్లార్చి తాగడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా బొప్పాయి గుజ్జును  ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగిస్తారు.  బొప్పాయి గుజ్జుకు కొద్దిగా బాదం పేస్ట్ కలిపి ముఖానికి మర్దన చేయాలి. పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది. చాలామందికి వేసవి కాలంలో ఎండకు ముఖం కమిలి పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖానికి బొప్పాయి గుజ్జు వాడటం వల్ల  ముఖం తిరిగి సహజ రంగును సంతరించుకొంటుంది.

బొప్పాయితో అన్ని ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా వున్నాయి ముఖ్యంగా గర్భం దాల్చిన స్త్రీ లు వీటిని తినడం ద్వారా గర్భశ్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here