బెల్ బాటమ్ వచ్చేది అప్పుడే..!!

18
Akshay Kumar Latest Movie

అక్షయ్ కుమార్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అక్షయ్ వైవిధ్యమైన నటుడిగా దేశమంతటా ఫేమస్ అయ్యారు.  తనదైన నటనతో బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా ఎదిగారు.ప్రస్తుతం అక్షయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కరోనా తరువాత బాలీవుడ్‌లో ఫస్ట్ షూటింగ్ ప్రారంభించిన సినిమా బెల్ బాటమ్.

ఈ సినిమాలో ఖిలాడి అక్కి హీరోగా చేస్తున్నారు. ఇందులో వాని కపూర్, లారా దత్తా కురేషి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. తాజాగా బెల్ బాటమ్ సినిమాను మే28న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ సినిమాని  దర్శకుడు రంజిత్ ఎమ్ తివారి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.వాళ్ళు ఊహించిన స్థాయిలో సినిమా రానిస్తుందేమో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here