ఆదాయంలో టాప్ గేర్లో వెళ్తున్న బీసీసీఐ..

23
bcci-highest-earner-from-iccs-new-revenue

ప్రస్తుతం భారతదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెట్ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు భారత్లోనే జనాలు. దాదాపు భారతదేశంలోని ఎక్కువమంది ప్రేక్షకులకు క్రికెట్ లవర్స్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక క్రికెట్ ప్రేక్షకులందరినీ క్యాష్ చేసుకుంటూ బీసీసీఐ ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో సరికొత్త టోర్నీలు నిర్వహిస్తూ వేల కోట్ల ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ బోర్డుల కంటే ఆదాయంలో బీసీసీఐ టాప్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి ఆదాయంలో తనకు తిరుగు లేదు అని నిరూపించింది. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక మైన క్రికెట్ బోర్డు గా కొనసాగుతుంది బీసీసీఐ. ఇక ప్రస్తుతం మరోసారి ఇది నిరూపించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ని ఇటీవలే బిసిసిఐ విడుదల చేసింది. ఇక ఈ షీట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి నికర విలువ 14,489.78 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. దీంతో అత్యధిక ఆదాయం కలిగిన క్రికెట్ బోర్డు గా బీసీసీఐ మరోసారి రికార్డ్ సృష్టించింది. అయితే 2014-15 సంవత్సరంలో బిసిసిఐ నికర విలువ 5438.61 కోట్లు మాత్రమే ఉండేది.

కానీ నాలుగేళ్లలో బిసిసిఐ ఆదాయం ఊహించని విధంగా పట్టింపు అయింది అని చెప్పాలి. ప్రతి ఏటా ఐపీఎల్ ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని బిసిసిఐ పొందుతుంది. ఇక దేశవాళీ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల కూడా వందల కోట్ల ఆదాయం బిసిసిఐకి వస్తుంది. అయితే బిసిసిఐకి కేవలం ఐపీఎల్ ద్వారానే 2407.46 కోట్లు వస్తూ ఉండడం గమనార్హం. అయితే బీసీసీఐ ప్రస్తుతం అన్ని క్రికెట్ బోర్డుల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకోవడమే కాదు తమ ఆదాయంలో నుంచి వివిధ దేశాల క్రికెట్ బోర్డులకు కూడా వందల కోట్ల సహాయం చేస్తూ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here