ఆసీస్ పర్యటనలో బలమైన బయో బబుల్ కావాలి : గంగూలీ

30
BCCI chief Sourav Ganguly says want stronger bio-bubble

ఐపీఎల్ 2020 సీజన్ అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ పర్యటనలో 3 వన్డే, 3 టీ20, 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ ఆడనుంది. అందువల్ల యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ లో పాల్గొన్న భారత జట్టు సభ్యులు వచ్చే నెలలో సిడ్నీకి వెళ్లి అక్కడ 14 రోజులు ఉండాల్సి ఉంది. అయితే భారత జట్టు ఆస్ట్రేలియాలో నిర్బంధంలో ఉన్నప్పుడు అక్కడి ప్రోటోకాల్‌లను ఫాలో అవ్వాల్సి వస్తుందని గంగూలీ తెలిపారు.

కానీ ప్రస్తుతం అక్కడికి చేరుకున్న తర్వాత ఆటగాళ్లు ఉండే బయో బబుల్ ను బలోపేతం చేయడం పై క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలలో ఉన్నట్లు తెలిపారు. అక్కడ కరోనా కేసులు పెద్దగా లేకపోయినప్పటికీ ఇది చాలారోజుల పర్యటన కాబట్టి ఆటగాళ్లు చాలా రోజులు బబుల్ లో ఉండాల్సి వస్తుంది అని దాదా పేర్కొన్నారు. అయితే ఈ పర్యటనలో ఆటగాళ్ల కుటుంబాలకు కూడా అనుమతించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here