ఆ భారత్ లెజెండ్ టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్…!

0
112
barath legend is technically strong

నేను నా కెరీర్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లను దగ్గర నుంచి చూసినా టెక్నీకల్ పరంగా పటిష్టమైన అతగాడు మాత్రం ఒక్కడే ఉన్నాడు అని అంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. తన హయాంలో బ్రియాన్ లారా, కుమారా సంగక్కారా, రాహుల్ ద్రావిడ్, జాక్వస్ కలిస్ లు వారి ప్రతిభ కనబరిచిన వారు కాగా, భారత దిగ్గజ అతగాడు సచిన్ టెండూల్కర్ మాత్రం చాలా స్పెషల్ అని అయన పేర్కొన్నాడు. ద్రావిడ్, సంగక్కారా, బ్రియాన్ లారా లు తమ అట తీరుతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరినప్పటికీ, సచిన్ మాత్రం చాలా కఠినమైన బ్యాట్స్‌మన్‌ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. సాంకేతికంగా తాను చుసిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ మాత్రం సచిన్ ఒక్కడేనన్నాడు.

సచిన్ ను అవుట్ చేయడం అంత సులువైన పని కాదని, టెక్నికల్‌గా సచిన్ చాలా స్ట్రాంగ్ అని చెబుతున్నాడు క్లార్క్. అతను ఏమైనా పొరపాటు చేసి వికెట్ సమర్పించుకోవాలి తప్ప ఎవ్వరికి అంత తేలిగ్గా లొంగేవాడు కాదు సచిన్. సచిన్ తప్పులు చేసేలా బంతులు వేసి బౌలర్లు పైచేయి సాధించాలి తప్ప, సాంకేతికంగా మాత్రం అతని కంటే బెస్ట్ బ్యాట్స్‌మన్‌ ను ఇప్పటివరకు నేను చూడలేదు. నాకు తెలిసిన సచిన్ ను టెక్నికల్‌గా గమనిస్తే అతనిలో బలహీనతలు ఏమీ కనబడేవి కావు. నా వరకూ సచిన్ అందటికంటే అత్యుత్తమం అని క్లార్క్ పేర్కొంటూ ప్రస్తుత శకంలో అన్ని ఫార్మాట్ల పరంగా చుస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బెస్ట్  బ్యాట్స్‌మన్‌ అని స్పష్టం చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here