భీష్మ పాత్ర స్టిల్స్ ను రిలీస్ చేసిన బాలకృష్ణ.

10
Balakrishna in Bhishma.by mirchipataka

తెలుగోడి వాడిని వేడిని ప్రపంచానికి పరిచయం చేసిన  స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితాన్ని ఆధారంగా తీసుకుని  తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించారు. కాగా నేడు భీష్మ ఏకాదశి కావడంతో నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను రిలీస్ చేసారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ” నాన్నగారు చేసిన పాత్రలలో భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్రలో నటించి   ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆ చిత్రం మరియు అందులోని నాన్నగారు పోషించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్టీఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు చిత్రీకరించాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే టైం ఎక్కువ తీసుకోవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలను తొలగించాము. ఇవాళ భీష్మ ఏకాదశి కావడంతో ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో మరియు నా అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను” అని బాలకృష్ణ తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here