పిల్లలకు ఆ పేరు పెట్టండి.. ఉచితంగా ఇంటర్నెట్ పొందండి..

41
18 years free internet from twifi

ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ తల్లిదండ్రులకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీ పేరును గనక తల్లిదండ్రులు వారికి పుట్టిన శిశువుకు పెడితే.. వారికి 18ఏళ్లు ఉచితంగా వైఫై సదుపాయం అందిస్తామని ఆ సంస్థ తెలిపింది.. పేరు బయటకు చెప్పడానికి అంగీకరించని ఓ స్విస్ జంట ఈ ఆఫర్ను ఒప్పుకుంది. స్విస్ ఇంటర్నెట్ సంస్థ Twifi ఈ ఆఫర్ ను ఇచ్చింది. ఆసక్తి గల తల్లిదండ్రులు ఎవరైనా సరే వారి శిశువుకు ఈ కంపెనీ పేరు పెట్టుకుంటే ఉచిత వైఫై సదుపాయం అందజేస్తామని తెలిపింది. దీంతో ఆ బిడ్డ తండ్రి ఫేస్బుక్ లో తమ అంగీకారాన్ని తెలియజేసాడు.అంగీకరించినట్లుగానే Twifi ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీ పేరును వారు తమ శిశువుకు పెట్టారు. ఇందుకు సదరు సంస్థ కూడా ముందు ఇచ్చిన ఆఫర్ ప్రకారం వారికి 18 సంవత్సరాలు ఉచితంగా వైఫై సేవలను అందించనుంది. దీనికి సంబంధించిన అన్నివివరాలను అక్కడి వార్తాసంస్థలు ప్రచురించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here