ఐరన్ ని అందించే ఆయుర్వేద మార్గాలివే..!!

14
Iron Gaining With Ayurvedic

ఏ పని చేయకుండానే అలసిపోయినట్లుగా అనిపిస్తుందా? ఎక్కువ శ్రమ పడకుండానే నీరసంగా మారుతుందా?  అది ఐరన్ లోపమే. శరీరానికి కావాల్సిన ఐరన్ సరైన పాళ్లలో అందకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.అయినా  పట్టించుకోకుండా పోతే దీర్ఘకాలంలో మరింత చెడు జరిగే అవకాశం ఉంది. అందుకే రక్తంలో ఐరన్ శాతం అనేది తగ్గకూడదు. దీనివల్ల రక్తహీనత ఏర్పడి తీవ్రరూపం దాల్చవచ్చు.

సరఫరా సామర్థ్యం తగ్గుతుంది.ఇలాంటివి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే  రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచే ఆయుర్వేద మార్గాల గురించి తెలుసుకుందాం.

నల్ల నువ్వులు :

ఇందులో ఐరన్ తో పాటుగా కాపర్, జింక్, సెలేనియం, విటమిన్ బీ6 ఉంటాయి.

నువ్వులని వేయించి, దానిలో కొంచెం తేనె, నెయ్యి కలిపి ఒక ఉండలాగా తయారు చేసి, రోజూ ఉదయం పూట తినాలి.

ఖర్జూరం, ఎండు ద్రాక్ష:

బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు రెండు నుంచి  మూడు ఖర్జూర పండ్లు, ఒక చెంచా ఎండు ద్రాక్ష తీసుకోవాలి.

బీట్ రూట్, క్యారెట్:

బీట్ రూట్ ని ముక్కలుగా చేసి జ్యూస్ చేసుకుని రోజూ ఉదయమే  తాగితే ఐరన్  లెవెల్స్ పెరుగుతాయి.

గోధుమ గడ్డి :

ఇందులో బీటా కెరాటిన్, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, ఐరన్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయమే  లేవగానే ఒక గ్లాసు తాగితే  రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

మునగా చెట్టు ఆకులు:

రోజూ ఉదయం మునగ ఆకుల పౌడర్  తినడం వల్ల రక్తంలో ఐరన్ శాతం పెరుగుతుంది. దీనిలో ఐరన్ తో పాటుగా  విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here