“Arjun Suravaram” Movie Review Live Updates

385
Arjun Suravaram

05:40 AM : హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

05:43 AM : మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సినిమా ఇప్పుడే మొదలయ్యింది.

05:49 AM : అర్జున్ ని అరెస్ట్ చెయ్యాలని అంటున్న నినాదాలతో సినిమా మొదలయ్యింది.కమిషనర్ ఆఫీస్ దగ్గర హీరో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరంగా ఎంట్రీ ఇచ్చాడు.

05:50 AM : ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్ లోకి వెళ్ళింది.అర్జున్ ఫ్యామిలీ సంబంధిత సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.

05:58 AM : నిఖిల్ మరియు లావణ్యలు ఓ స్టింగ్ ఆపరేషన్ లో కలుసుకున్నారు.నిఖిల్ ఫ్రెండ్ గా సత్య కూడా ఇప్పుడే జాయిన్ అయ్యాడు.ఈ నేపథ్యంలో తికమక మకతిక సాంగ్ మొదలయ్యింది.

06:02 AM : ఓ లాయర్ గా వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు ఓ ఫన్నీ టీవీ డిబేట్ సీన్ నడుస్తుంది.

06:15 AM : ఇప్పుడు అర్జున్ పాత్ర మరింత మెరుగవుతూ వస్తుంది.ఇదే సమయంలో అర్జున్ బీబీసీ లో జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యాడు.

06:17 AM : ఇప్పుడు హిట్ ట్రాక్ కన్నె కన్నె సాంగ్ మొదలయ్యింది.ఈ సాంగ్ లో నిఖిల్ మరియు లావణ్యాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.

06:24 AM : ఇప్పుడు ఊహించని రీతిలో ట్విస్ట్ చోటు చేసుకుంది.ఓ లోన్ ఫోర్జరీ కేసులో నిఖిల్ అరెస్ట్ అయ్యాడు.

06:38 AM : నిఖిల్ ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.అతని టీమ్ కేసును ఇన్వెస్టిగేషన్ చెయ్యడం మొదలు పెట్టారు.

06:45 AM : ఇప్పుడు నిఖిల్ మరియు అతని స్నేహితులు ఓ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే గ్యాంగ్ పై దృష్టి పెట్టారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

06:49 AM : ఇప్పుడు ఆ స్కామర్స్ కు మరియు నిఖిల్ కు మధ్య కొన్ని ఆసక్తిభరిత సన్నివేశాలు వస్తున్నాయి.

07:00 AM : ఓ ఆసక్తికర ట్విస్ట్ తో సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.

07:02 AM : ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయతే సినిమా డీసెంట్ గా కొనసాగింది.మంచి ట్విస్టులు కథనంతో ఇంటర్వెల్ కు 30 నిమిషాల నుంచి బాగుంది.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

07:13 AM : ఇంటర్వెల్ అనంతరం నిఖిల్ మరియు విలన్ మధ్య మరింత ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

07:22 AM : చిన్న స్కూల్ పిల్లలకు ఆక్సిడెంట్ అయ్యిన సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా వస్తున్నాయి.దీనంతటి వెనుక ఆ ఫేక్ సర్టిఫికెట్ల మాఫియాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా సీన్స్ వస్తున్నాయి.

07:27 AM : ఇప్పుడు బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ మొదలయ్యింది.ఇందులో హీరో మరియు విలన్ మధ్య మరిన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు వస్తున్నాయి.

07:41 AM : ఇప్పుడు నిఖిల్ లావణ్య మరియు వెన్నెల కిషోర్ ల సాయంతో ఇంకో అనధికారిక స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాడు.

07:46 AM : ఇప్పుడు మరో థ్రిల్లింగ్ ఎపిసోడ్ ద్వారా ఆ సర్టిఫికెట్ల స్కాం కు సంబంధించి మరింత సమాచారం రివీల్ అవుతుంది.

07:56 AM : ఇప్పుడు వెన్నెల కిషోర్ మరియు మిగతా గ్యాంగ్ మధ్య ఓ బలమైన ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.

08:02 AM : ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటుగా పోలీస్ కస్టడీలో ఉన్న అర్జున్ ఇంటరాగేషన్ కూడా పూర్తయ్యింది.

08:05 AM : ఇప్పుడు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది.నిఖిల్ తాను నిరపరాదిని అని నిరూపించుకొని అసలు నిందితులను పట్టించడానికి అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నాడు.ఇప్పుడు చేగువేరా సాంగ్ మొదలయ్యింది.

08:14 AM : మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం mirchipataka ను చూస్తూ ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here