అసెంబ్లీ సమావేశాలు తేదీ షురూ..

21
ap-assembly-sessions-to-begin-in-march-third-week

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మార్చి మూడో వారంలో ఉండే అవకాశాలున్నాయి. వాస్త‌వానికి అంత కంటే ముందే స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని అనుకున్నా మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఉండ‌డంతో ఈ స‌మావేశాలు కాస్త వాయిదా వేశారు. వచ్చే మార్చి 14వ తేదీతో మున్సిపల్ ఎన్నికలు ముగియనుండటంతో అసెంబ్లీ సమావేశాలను మర్చి మూడు లేదా నాలుగు వారాలలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది.

ఇక ఈ సారి బ‌డ్జెట్ స‌మావేశాల‌పైనే అంద‌రి దృష్టి ఉంది. పోయిన సారి కరోనా వ‌ల్ల బ‌డ్జెట్ స‌మావేశాలు చ‌ప్ప‌గా జ‌రిగాయి. ఈ సారి మాత్రం బడ్జెట్ సమావేశాలను ఈసారి సుదీర్ఘంగానే నిర్వహించే అవకాశముంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేయనుంది. ఈ సారి టీడీపీ అసెంబ్లీలో అధికార పార్టీని ఎలా నిలువ‌రిస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here