అనుష్క ‘నిశబ్ధం’ కూడా ఓటీటీ వైపే…

0
53
anushka's nissabdam movie also in OTT

కరోనా వలన సినిమా ధియెటర్లుతెరుచుకునేలా కనిపించకపోవడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఇప్పటికే కీర్తి సురేశ్‌ ‘పెంగ్విన్‌’, సుధీర్‌బాబు, నాని ‘v’ చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్నిసొంతం చేసుకున్నాయి.. ఇందులో భాగంగానే అనుష్క ‘నిశబ్ధం’ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.. బుధవారం అగ్రిమెంట్ పూర్తి కానుంది, ఆ తరువాత సినిమా విడుదల తేదిని తెలపనున్నారు. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరిలోనేవిడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వలన ఎన్నోసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు.

ఇందులో అనుష్క మూగ పాత్రలో నటిస్తోంది. అనుష్కతో పాటుగా అంజలి, శాలిని పండే, మాధవన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు..ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో ఎక్కువ భాగం విదేశాల్లోనే రూపుదిద్దుకుంది.. ఇక ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ అవ్వగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా పైన అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఓటిటి లో సక్సెస్ అవుతుందో లేదో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here