యాంకర్ ప్రదీప్ సినిమా విడుదల తేదీ ఖరారు ..!!

20
Yanchor Pradeep Movie Date Finalized

యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ మూవీ 30రోజుల్లో ప్రేమించడం ఎలా. గత ఏడాది వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా అన్ని సినిమాలా లాగే వాయిదా పడింది. 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకి రిలీజ్ డేట్ దొరికేసింది. సంక్రాంతి సందర్భంగా  థియేటర్లకి కొత్త సందడి వస్తుంది.

ఇప్పటి వరకూ ఆగిపోయిన సినిమాలన్నీ థియేటర్ల బాట పడుతున్నాయి. 30 రోజుల్లోప్రేమించడం ఎలా సినిమా జనవరి 29 వ తేదీన విడుదల అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా నుండి విడుదలైన నీలి నీలి ఆకాశం ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు . మొదటి సినిమా పాటకె  ఈ రేంజ్ లో  హైప్ రావడం ప్రదీప్ కి మంచి కలిసొచ్చే పరిణామం. అమృత అయ్యర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాని మున్నా దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయ్యి, టాలీవుడ్ లో హీరోగా ప్రదీప్ నిలబడతాడా అనేదే చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here