

కమెడియన్‌గా, హీరోగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు..ఇలా ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల టాలెంట్ కలిగిన నటుడు సునీల్. ఇటీవలే కలర్‌ఫొటోతో ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా అందరినీ పలకరించాడు సునీల్. ఈ సినిమా సునీల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కలర్‌ఫొటో సక్సెస్ తో ఫుల్ జోష్ గా ఉన్న సునీల్ హీరోగా ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. వేదాంతం రాఘవయ్య టైటిల్ కార్యక్రమం ఆదివారం జరిగింది.
హరీశ్ శంకర్ ఈ చిత్రానికి కథనందిస్తుండగా..14 రీల్స్ ప్లస్ బ్యానర్ సమర్పిస్తోంది.రీసెంట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సునీల్ సరసన టాలీవుడ్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. డైరెక్టర్ సీ చంద్రమోహన్ అనసూయకి కథ వినిపించగా,అనసూయ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడట. సాయికార్తీక్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. రాం ఆచంట, గోపీచంద్ ఆచంట స్వయంగా నిర్మిస్తున్నారు, రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.