

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదలకానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో లేడి సూపర్‌స్టార్ రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రమ్యకృష్ణ ఊహించని లుక్ లో కనిపించింది. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా షూటింగ్ సెట్స్‌లో దిగిన ఓ ఫొటోను రమ్యకృష్ణ తన సోషల్ మీడియాలో అబిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలో బేస్తవారి లుక్‌లో రమ్యకృష్ణ కనిపించారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమాలలో తల్లి పాత్రలకు బాగా ప్రాధాన్యమిస్తూ ఉంటాడు. అమ్మ నాన్నఓ తమిళమ్మాయి, లోఫర్ చిత్రాల్లో తల్లి పాత్రలను చుస్తే మనకు అర్ధమయ్యే ఉంటుంది. ఇక ఇప్పుడు లైగర్ సినిమాలో కూడా రమ్యకృష్ణ పాత్ర గుర్తుండిపోయేలా పూరీ కథను రాసుకున్నట్లు అర్ధమవుతుంది.